మకర సంక్రాంతి

         మకర సంక్రాంతి విశేషాలు

             సంక్రాంతి  అంటే  పుష్య  మాసంలో, హేమంత  ఋతువులో,  శీతా  గాలులు వీస్తూ, మంచు  కురిసే కాలంలో  సూర్యుడు  మకర  రాశిలోనికి  ప్రవేశిస్తాడని  మనకు  తెలుసు. ఈ  రోజు  నుంచి స్వర్గ  ద్వారాలు  తెరచి  ఉంటాయని  పురాణాలు  పేర్కొన్నాయి.
            
               సంక్రాంతి  అనగానే అందమైన, ఆహ్లాదకరమైన  పాడి పంటలు, పల్లె  వాతావరణం, పగటి  వేషధారులు, జానపద  వినోద  కళాకారులు, హరిలో  రంగ  హరి  అంటూ  అక్షయ  పాత్రతో  వచ్చే  హరిదాసులు, రంగ  వల్లులు, ప్రాముఖ్యమైన రధం  ముగ్గు, కృష్ణుడి  భక్తురాల్లైన  గోపికలకు సంకేతంగా  గోపి + బొమ్మలు = గొబ్బెమ్మలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, చలిని పారద్రోలడానికి  మరియు  పనికిరాని  వస్తువులను మంటల్లో  వేసి  దరిద్రం  వదిలి  నిత్య  నూతన జీవితాన్ని  ఆరంభించడానికి  గుర్తుగా  వేసే  భోగి మంటలు, పిల్లలను  ఆశీర్వదిస్తూ  పోసే  భోగి పండ్లు, గాలి  పటాలు, పశు  పూజ, రకరకాల  పిండి వంటలు,  పితృ  దేవతలకు  తర్పణలు, పొంగలి, కనుమ  రోజున  విధిగా  తినే  మాంసాహారం, గోదానాలు,  తమిళనాడులో  ప్రసిద్ధి  చెందిన  జల్లికట్టు  మరియు  కర్ణాటకలో  ప్రసిద్థి  చందిన  కంబలి. ఇవి మాత్రమే  సాధారణంగా  తెలిసిన  విషయాలు.   
         ఆంధ్ర  ప్రదేశ్,  తెలంగాణ,  కర్ణాటక రాప్ట్రాలలో  పెద్ద  పండుగ, కొన్ని  ప్రాంతాలలో మూడు  రోజులు, మరి  కొన్ని  ప్రాంతాలలో  నాలుగు  రోజులు  జరుపుకునే  ఈ  పండుగకి పూర్వం  నుంచే  చాల  విశిష్టత  ఉంది
           హిందువులు  జరుపుకునే  పండుగలలో సంక్రాంతి  మాత్రమే  సౌర  గమనాన్ని  అనుసరించి వస్తుంది.     

గంగా నది భూమి మీదకి వచ్చిన రోజుగా చెప్తారు :
        పూర్వం  సగర్వుడనే  రాజు  ఉండేవాడు. అతనికి  అరవై  వేల  మంది  కొడుకులు.  వాళ్ళంత ఒక  సారి  కపిల  ముని  ఆశ్రమంలోకి  ప్రవేశించి ఆయన  తపస్సుని  భంగం  చేశారు. దానితో ఆగ్రహం  చెందిన  కపిలముని  వాళ్ళందరిని బూడిదగ  మార్చేశాడు. ఆ  బూడిద  మీద  గంగ ప్రవహిస్తేనే  గాని  వారి  ఆత్మ  శాంతించదని సగర్వుడికి  తెలిసింది. కాని  ఆకాశంలో  ఉండే గంగని  ఎవరు  నేల  మీదకి  తేలేకపొయ్యారు. ఆ సమయంలో  సగర్వుడి  వంశంలో  పుట్టిన భగీరధుడు  ఆ  పని  చేయగలిగాడు. భగీరధుని తపస్సుకి  మెచ్చిన  గంగమ్మ  సంక్రాంతి  రోజునే భూమి  మీదకి  వచ్చింది.

గంగిరెద్దులు  రావడం  వెనుక  ఉన్న  కథ :

              పూర్వం  గజాసురుడు  అనే  రాక్షసుడు ఉండేవాడు. శివుడు  తన  కడుపులో  ఉండేలా గజాసురుడు  వరాన్ని  కోరుకున్నాడు.శివుడిని బయటికి  రప్పించేందుకు  విష్ణుమూర్తి  ఒక ఉపాయం  ఆలోచించాడు. దేవతలంతా  ఒక్కొక్క వాయిద్యాన్ని  పట్టుకొని  నందితో  కలిసి గజాసురుడి  దగ్గరికి  బయల్ధేరారు. వీళ్ళ  ప్రదర్శనకు  మెచ్చిన  గజాసురుడు  ఏదైనా  వరం కోరుకోమని  అన్నాడు. అంతటితో  దేవతలు  తన కడుపులో  ఉన్న  శివుడిని  బయటికి  పంపమని అడిగారు. అలా  ఇప్పటి  గంగిరెద్దుల సంప్రదాయానికి  నాంది  అని  చెబుతారు.

కనుమ  రోజు  పశువులని  పూజించడం :
              క  రోజు  శివుడు  నందిని  పిలిచి "భూలోకంలో  అందరూ  ఒంటికి  నూనె  పట్టించి స్నానం  చేయాలి. నెలకి  ఒక  సారె  ఆహారం తీసుకోవాలి"  అని  చెప్పి  రమ్మన్నాడు. కానీ  నంది అయోమయంలో  "రోజు  ఆహారం తీసుకోవాలి, నెలకి  ఒక  సారె  స్నానం  చేయాలి"  అని చెప్పిందంట. దానితో  ఆగ్రహించిన  శివుడు "ప్రజలు రోజు  తినాలంటే  చాలా  ఆహారం  కావాలి. ఆ ఆహారాన్ని  పండించేందుకు  నువ్వే   సహాయపడాలి" అని  శపించాడు. అప్పటినుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట. కనుమ  రోజు  పశువులని  సాక్షాత్తు  నందీశ్వరుడీగా  భావించి  పూజిస్తారు.

గాలిపటాలు  ఎగరవేయడం :

              సంక్రాంతికి  గాలిపటాలు ఎగురవెయ్యడానికి  కూడా  ఒక  ఉద్దేశం ఉంది. ఉత్తరాయణం  ప్రారంభంలో  దేవతలు  భూమి మీదకి  వస్తారని  అంటారు  కనుక, దేవతలకి ఆహ్వానం  పలుకడం  కోసం  గాలిపటాలు ఎగరవేస్తారు.

సంక్రాంతి పర్వ దినాన దానం చేయడం వలన కలిగిన ఫలితం:
          పూర్వం మకర సంక్రాంతి రోజున దుర్వాస మునికి పెరుగు దానం చేసిన ద్రోణాచార్యుని భార్య 'కృషి' కి అశ్వర్ధామ జన్మించారు.

గొబ్బెమ్మల  సంస్కృతి :
         పూర్వం  గోదాదేవి పూర్వ ఫల్గుణ నక్షత్రంలో కర్కాటక  లగ్నంలో  తులసి  వనంలో జన్మించినది. ఆమె  గోపికలతో  కలిసి  శ్రీ  కృష్ణుడిని  ఆరాధించి ధనుర్మాసం  చివరి  రోజున  అనగా  ఈ  మకర సంక్రాంతి  రోజునే  విష్ణు  మూర్తిని  పెళ్ళి చేసుకుంది. చుట్టూ  ఉండే  చిన్న  గొబ్బెమ్మలు  గోపికలైతే  మధ్య  పెట్టే  గొబ్బెమ్మ   శ్రీ కృష్ణుడి  భక్తురాలైన  గోదాదేవికి  సంకేతం.
           

Popular posts from this blog

REASON FOR BLIND FOLD OF LADY OF JUSTICE

INDIAN NATIONAL FLAG

INDIAN NAVY DAY