అతిరథ మహారథులు

               సాధారణంగా గొప్ప గొప్పవాళ్ళని సంబోధించడానికి అతి రధ మహారధులు అంటాం. కాని, ఆ పదాలు యుధ్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలుపుతాయని చాలామందికి తెలియదు.
రధులు :                                                                       రధులు అనగా ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న వారు అని అర్ధం. సోమదత్తుడు, సొదక్షుణుడు, శకుని, శిశు పాలుడు, ఉత్తరుడు, కౌరవులలో 96 మంది, శిఖండి, ఉత్తమాజులు, ఉప పాండవులు. వీరందరు రథులు అనబడతారు.
అతి రధులు( రధికి 12 రెట్లు ) :                                        అతి రధులు అనగా 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న వారు. అని అర్ధం. లవకుశులు, కృతవర్మ, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, దృపధుడు,  యుయుతూసుడు, విరాఠుడు, అకంపనుడు, సాత్యకి, దృష్టద్మునుడు, కుంతిభోజుడు, ఘటోత్కచుడు, ప్రహస్తుడు, అంగదుడు, దుర్యోధనుడు, జయధ్రదుడు, దుస్మసనుడు, వికర్ణుడు, విరాఠుడు, యుదీష్టరుడు, నకుల సహదేవులు,  ప్రద్యుమనుడు. వీరందరిని  అతిరథులు అంటారు.
మహారధులు ( అతిరధికి 12 రెట్లు) :                                        మహారధులు అనగా 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలవారు. రాముడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రావణుడు, భగదత్తుడు, నరకాసురుడు, లక్ష్మణుడు, బలరాముడు, జరాసంధుడు. వీరందరిని  మహారధులు అంటారు.

Popular posts from this blog

REASON FOR BLIND FOLD OF LADY OF JUSTICE

INDIAN NAVY DAY

INDIAN NATIONAL FLAG