సాధారణంగా గొప్ప గొప్పవాళ్ళని సంబోధించడానికి అతి రధ మహారధులు అంటాం. కాని, ఆ పదాలు యుధ్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలుపుతాయని చాలామందికి తెలియదు. రధులు : రధులు అనగా ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న వారు అని అర్ధం. సోమదత్తుడు, సొదక్షుణుడు, శకుని, శిశు పాలుడు, ఉత్తరుడు, కౌరవులలో 96 మంది, శిఖండి, ఉత్తమాజులు, ఉప పాండవులు. వీరందరు రథులు అనబడతారు. అతి రధులు( రధికి 12 రెట్లు ) : అతి రధులు అనగా 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న వారు. అని అర్ధం. లవకుశులు, కృతవర్మ, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, దృపధుడు, ...